: శభాష్ హేమలత.. ఎంసెట్ ‘మెడికల్’ ఫస్ట్ ర్యాంకర్‌ను అభినందించిన చంద్రబాబు
ఈరోజు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో 156 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని హేమలతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడలో మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావుతో కలిసి చంద్రబాబు హేమలతకు పుష్పగుచ్చాన్నిచ్చి, ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. అనంతరం హేమలత మీడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్‌లో న్యూరాలజీ చదవాలన్నదే తన ఆశయమని తెలిపింది. తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పింది. హేమలత గత ఏడాది కూడా ఎంసెట్ పరీక్ష రాసింది. గత ఏడాది ఎంసెట్‌లో 245వ ర్యాంకు సాధించింది. కానీ, అప్పుడు వయసు సరిపోకపోవడంతో మెడికల్ సీటు కోల్పోయింది. హేమలతకి ఈసారి మొదటి ర్యాంకు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.