: హైదరాబాద్‌లో గాలి వాన బీభత్సంపై రెస్క్యూ టీమ్‌లను దించాం: మంత్రి తలసాని
హైదరాబాద్‌లో గాలి వానతో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ అధికారులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు. అక్రమ హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని తలసాని అధికారులను ఆదేశించారు. రెస్క్యూ టీమ్‌లను ఇప్పటికే నష్టనివారణ చర్యల కోసం పంపించామని ఆయన మీడియాకు తెలిపారు. గాలి వాన బీభత్సం తెచ్చిపెట్టిన నష్టాలపై ప్రజలు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పరిస్థితుల్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి ఇప్పటి వరకు 420 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.