: అరగంట గాలివానకే హైదరాబాద్ అద్వానంగా మారింది.. ఇక విశ్వనగరంగా ఎలా చేస్తారు?: రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ని విశ్వనగరం చేస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారని, కానీ నగర పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో తెలుస్తోందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో అరగంట గాలివానకే పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితినే చక్కదిద్దలేకపోతోన్న కేటీఆర్.. హైదరాబాద్‌ని విశ్వనగరంగా ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు. దుస్థితిలో ఉన్న హైదరాబాద్ ని వదిలేసి కేటీఆర్ విదేశాలకు వెళ్లారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌ను ఏనాడో టీడీపీ ప్రభుత్వం విశ్వనగరంగా అభివృద్ధి చేసి చూపించిందని ఆయన వ్యాఖ్యానించారు.