: విజయవాడలో దారుణం.. టిఫిన్ పెట్టలేదన్న కోపంతో కోడల్ని గొంతునులిమి చంపేసిన వైనం
కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని 'నున్న'లో దారుణం చోటుచేసుకుంది. సత్యనారాయణ అనే ఓ కసాయి తన కోడలిని గొంతునులిమి చంపేశాడు. కోడలు సుమతి టిఫిన్ పెట్టలేదన్న కోపంతో సత్యనారాయణ ఆమె గొంతునులిమాడు. సుమతి ఎంత వేడుకున్నా సత్యనారాయణ వదలలేదు. దీంతో కోడలు సుమతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పారిపోయే ప్రయత్నం చేసిన సత్యనారాయణని స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకి అప్పగించారు. పోలీసులు సుమతి హత్యపై కేసు నమోదు చేసుకున్నారు.