: దీపికా పదుకొనే ఇచ్చిన బహుమతితో స్టైల్ గా తయారవ్వాలి: హాలీవుడ్ దర్శకుడు


‘ట్రిపులెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాలో నటిస్తున్న దీపికా పదుకునే ఆ సినీ దర్శకుడు డి.జె.కురుసోకు ఓ బహుమతి ఇచ్చింది. ఆ బహుమతికి కురుసో ఎంతో ముచ్చటపడిపోయాడు. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో తనకు ఓ గిఫ్ట్ ఇచ్చిందని, ఆ బహుమతి ఎంతో బాగుందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా దీపికా పదుకునే ఇచ్చిన భారతీయ సంప్రదాయ కుర్తా, పైజామా, షూస్ వేసుకుని స్టైల్ గా తయారవ్వాలని అనుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎంబ్రాయడరీ చేసిన కుర్తా, పైజమాలతో పాటు మ్యాచింగ్‌ పాదరక్షల ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News