: సూపర్ సేల్ స్కీమును ప్రకటించిన ఎయిర్ ఇండియా


లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థలతో మరింతగా పోటీ పడుతూ ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా 'సూపర్ సేల్' పేరిట ప్రత్యేక స్కీమును ప్రారంభించింది. ఇందులో భాగంగా నేటి నుంచి మే 25 మధ్య బుక్ చేసుకుని, ప్రయాణ తేదీని జూలై నుంచి సెప్టెంబర్ 30 మధ్య నిర్ణయించుకునే వారికి రూ. 1,499 ప్రారంభ ధరలో (అన్ని పన్నులూ కలుపుకుని) టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. తాము నడుపుతున్న అన్ని దేశవాళీ రూట్లలో ఈ ఆఫర్ లభిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గతవారంలో స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఆసియా తదితర సంస్థలు ఇదే తరహా తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పైస్ జెట్ రూ. 511 (పన్నులు అదనం), ఇండిగో రూ. 800 (పన్నులు అదనం)కు టికెట్లను విక్రయించాయి.

  • Loading...

More Telugu News