: ఏపీని నాలెడ్జ్ హబ్ గా చేస్తాం.. ప్రతీస్కూల్ కి వైఫై సౌకర్యం కల్పిస్తాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ కాలేజీకి ఫైబర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని, డిజిటల్ క్లాస్‌లు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైస్కూళ్లలోనూ వైఫై సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కౌన్సెలింగ్, ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిపై సమాచారం ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆంధ్రని నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.