: ఏపీ ఎంసెట్ ‘మెడికల్’ ఫలితాలు విడుదల.. హేమలతకు మొదటి ర్యాంక్, సాత్విక్ రెడ్డికి రెండో ర్యాంక్
ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో హేమలత 156 మార్కులతో మొదటి ర్యాంకు, సాత్విక్ రెడ్డి 155 మార్కులతో రెండో ర్యాంకు, యజ్ఞప్రియ 153 మార్కులతో మూడో స్థానం, చిట్లూరి నేహా 152 మార్కులతో నాలుగో ర్యాంకు సాధించారు. నీట్‌పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఊరట లభించిందని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.