: దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే వెళుతోంది: ఆర్‌బీఐ గవర్నర్
దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే వెళుతోందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరుగుతోన్న ఆర్బీఐ ఉద్యోగుల మూడు రోజుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్బీఐ ఇప్పటివరకు పూర్తి స్వేచ్ఛతో, ప్రభుత్వ మద్దతుతో ఉందని, స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించాలని ఆయన అన్నారు. ఆ స్వేచ్ఛ తమకు కావాలని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు కీలకమైనవని కచ్చితమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. వ్యవసాయ ఆధారితమైన మన ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. అనంతరం ఒడిశాలోని రఘురామ్ రాజన్ అక్కడి కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యాజమాన్యంతోనూ చర్చించారు.