: కాసేపట్లో ఏపీ ఎంసెట్ ‘మెడికల్’ ఫలితాలు.. వెయ్యిలోపు ర్యాంకర్లకు ఉచిత వైద్య సీట్లు
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ‘మెడికల్’ ఫలితాలను మరికాసేపట్లో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాల్లో వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఉచితంగా వైద్య సీట్లు పొందవచ్చని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నీట్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని కామినేని అన్నారు. వచ్చే ఏడాది నుంచి నీట్ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం హర్షించతగ్గ విషయమని, వచ్చే ఏడాది నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు రాష్ట్ర విద్యార్థులను సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. నీట్ సిలబస్‌పై నేడు మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్‌లో చర్చించనున్నట్లు తెలిపారు.