: తప్పుడు ట్రాన్స్ లేషన్ కు రూ. 25 వేల ఫైన్ విధించిన సుప్రీంకోర్టు!


హిందీ నుంచి ఇంగ్లీషులోకి అత్యంత దారుణంగా అనువాదం చేయించిన ఓ పిటిషనర్ కు రూ. 25 వేల జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జ్యుడీషియల్ ఉత్తర్వులను అనువదిస్తూ, వరదరామ్ అనే పిటిషనర్ తరఫు న్యాయవాది ఐశ్వర్యా భాటి కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో గ్రామర్ లేకపోవడం, పదాల వాడకంలో తప్పులు, వాక్య నిర్మాణంలో లోపాలు, కనీసం కామాలు కూడా సరిగ్గా లేని దాన్ని చూసిన న్యాయమూర్తులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి తప్పులు ఇప్పటివరకూ తాము చూడలేదని, గంట సేపు చదివితేగాని విషయం తమకు అర్థం కాలేదని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు 24 గంటల్లోగా జరిమానా చెల్లించకుంటే, దాన్ని మరింతగా పెంచుతామని హెచ్చరించడం గమనార్హం. అనువాదకుడి పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని న్యాయవాది వెల్లడించడాన్ని తప్పుబడుతూ, కనీసం కోర్టుకు సమర్పించే ముందైనా చూసి వుండాల్సిందని మందలించారు.

  • Loading...

More Telugu News