: బాబు చెప్పారు, కేంద్రం కదిలింది: 'నీట్'పై కామినేని


మెడికల్ ఎంట్రెన్స్ పొందగోరేవారికి ఇబ్బంది కలిగిస్తుందని భావించిన మీదటే, నీట్ ను ఈ సంవత్సరం అమలు చేయవద్దని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి కామినేని వ్యాఖ్యానించారు. నీట్ పై ఆర్డినెన్స్ తేవాలని మొట్టమొదట కోరింది చంద్రబాబేనని, ఆపైనే కేంద్రం కదిలిందని ఆయన అన్నారు. ఏపీలో ఎంసెట్ మెడికల్ ఫలితాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నందున, సీఎం స్వయంగా వాటిని విడుదల చేస్తారని తెలిపారు. నిన్నమొన్నటి వరకూ ఎలుకలు రాజ్యమేలిన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగి, అది విజయవంతం కావడం ప్రభుత్వానికి ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించే నిమిత్తం పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కామినేని వెల్లడించారు.

  • Loading...

More Telugu News