: కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు... యూపీకి మరిన్ని కేబినెట్ బెర్తులు!


కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కసరత్తు ప్రారంభించారు. ఈ అంశంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలతో ఈ రాత్రి ప్రధాని చర్చిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలని చూస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో యూపీ నుంచి మరికొంత మందికి కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించే అవకాశమున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కాగా, తాజాగా వెలువడ్డ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆనందోత్సాహంలో ఉంది. అస్సాంలో బీజేపీ జెండా ఎగురవేయగా, కేరళ రాష్ట్రంలో ఒక స్థానాన్ని ‘కమలం’ సాధించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News