: తెలంగాణ ప్రాజెక్టుల నుంచి వచ్చే డబ్బుతో జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు!: మంత్రి దేవినేని ఉమ
వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణ పనులు దక్కించుకున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టుల నుంచి వచ్చే డబ్బుతో తన ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా జగన్ కాపాడుకుంటున్నారని అన్నారు. దొంగ జలదీక్షలు చేస్తున్న జగన్ కు చంద్రబాబును విమర్శించే హక్కు లేదని అన్నారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేస్తామని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ఉమాభారతికి వివరించామని దేవినేని ఉమ చెప్పారు.