: అధికార అన్నాడీఎంకేకు ఈసీ లొంగిపోయింది: డీఎంకే నేత కరుణానిధి
తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. తీవ్ర నిరాశలో ఉన్న ఆ పార్టీ అధినేత కరుణానిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికార పార్టీ అన్నాడీఎంకేకు ఎన్నికల సంఘం (ఈసీ) లొంగిపోయిందని ఆరోపించారు. ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ రూ.570 కోట్ల విషయమై ఈసీ ఎటువంటి సమాధానం చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా అవరకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, పీఎంకే పార్టీల కారణంగానే ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయన్నారు. మరోసారి వాయిదా వేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని కరుణానిధి హెచ్చరించారు.