: నేను పెళ్లి చేసుకుంటున్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు: విలేకరులతో సల్మాన్ ఖాన్
‘నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటున్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు’ అని విలేకరులను ఉద్దేశించి బాలీవుడ్ అగ్రహీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. ఈరోజు నిర్వహించిన ఐఫా అవార్డులకు సంబంధించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సల్మాన్ మాట్లాడాడు. ‘నేను పెళ్లి చేసుకున్నప్పుడు ట్వీట్ చేస్తాను. ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాను. ఈ విషయాన్ని నాకు, నా ఫ్యాన్స్ కి మధ్య ఉంచుతాను’ అని అన్నాడు. కాగా, తన ప్రియురాలు, రొమానియాన్ టీవీ స్టార్ యులియా వాంతూర్ ని సల్మాన్ ఈ ఏడాది డిసెంబర్ 27న వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే సల్మాన్ తన పెళ్లి గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.