: అమీర్ పేట్ బిగ్ సినిమాస్ లో 'బ్రహ్మోత్సవం' అభిమానుల ఆందోళన
హైదరాబాదులోని అమీర్ పేట బిగ్ బజార్ లోని బిగ్ సినిమాస్ థియేటర్ లో మహేష్ బాబు అభిమానులు ఆందోళన చేశారు. నేడు విడుదలైన 'బ్రహ్మోత్సవం' సినిమాను తొలి రోజే వీక్షించాలని ముందుగానే అభిమానులు టికెట్లు తీసుకున్నారు. తాము అనుకున్న సమయం వచ్చేసింది. దీంతో అంతా ఎంతో ఉత్సాహంగా సినిమా వీక్షిస్తుండగా, ఇంటర్వెల్ తరువాత ఏసీలు పనిచేయడానికి మొరాయించాయి. దీంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. మహేష్ బాబు అభిమానుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో వారి సినిమా టికెట్ ధరను బిగ్ సినిమాస్ యాజమాన్యం వెనక్కి తిరిగి ఇచ్చేసింది. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర ఎక్కువైనా ప్రశాంతంగా సినిమాను వీక్షించే సౌకర్యాలు ఉంటాయనే వస్తామని, అలాంటిది టికెట్ ధరలు వసూలు చేసి, మధ్యలో సాంకేతిక లోపం కారణం చెప్పి ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు వ్యాఖ్యానించారు.