: ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అవివాహితులు
తాజాగా జరిగిన ఎన్నికల నేపథ్యంలో అధికారం చేపట్టనున్న ముగ్గురు ముఖ్యమంత్రులు అవివాహితులు కావడం విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి కానున్న సర్బానంద సోనోవాల్ అవివాహితులు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురూ కూడా ఆయా రాష్ట్రాల్లో తమ వ్యక్తిగత ప్రతిష్ఠ కారణంగా విజయాన్ని తమ పార్టీలకు కట్టబెట్టడం విశేషం.