: ‘కాపు’ భవనాలకు చంద్రబాబు పేరు పెడితే తప్పేంటి?: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ


‘కాపు’ భవనాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పెడితే తప్పేంటని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రశ్నించారు. కాపునాడు, కాపు సంఘాల కోరిక మేరకే చంద్రన్న పేరు పెట్టామని చెప్పారు. వారు చెప్పిన ప్రకారమే చేశామని, దీనిని కొంతమంది రాజకీయం చేస్తుండటం తగదని ఆయన విమర్శించారు. కాగా, ఏపీలోని పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ‘చంద్రన్న’ అనే పదం ఉండటంపై ఇటీవల విమర్శలు తలెత్తాయి. ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ ఆ తర్వాత ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’, ‘చంద్రన్న వ్యవసాయ క్షేత్రం’... ఇలా సుమారు 12 ప్రభుత్వ పథకాలకు ‘చంద్రన్న’ అనే పదం ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News