: తెలంగాణ 'టెట్'కు సర్వం సిద్ధం...బ్లాక్ పెన్ తోనే పరీక్ష రాయాలి


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న 'టెట్' (టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్)కు సర్వం సిద్ధమని అధికారులు తెలిపారు. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్‌ మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 22న నిర్వహించనున్న టీఎస్‌ టెట్‌ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అన్నారు. ఈ పరీక్షకు 3,73,494 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్ష హాలుకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. టెట్ పరీక్షలో బ్లాక్‌ పెన్ను మాత్రమే వాడాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News