: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రతి జిల్లాకు 30 లక్షలు: సీఎస్


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లెలోనూ సంబరాలు మిన్నంటాలని చీఫ్ సెక్రటరి (సీఎస్) ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 30 లక్షల రూపాయల నిధులు అందజేస్తామని ఆయన చెప్పారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అమరవీరుల విగ్రహాలకు నివాళులర్పించాలని ఆదేశాలు జారీ కానున్నాయని తెలుస్తోంది. అలాగే ఉద్యోగార్హతలను బట్టి అమరవీరుల కుటుంబాల్లో ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఆవిర్భావ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News