: చంద్రబాబు పాలనను ఎన్ఆర్ఐ లు కూడా అసహ్యించుకుంటున్నారు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎన్ఆర్ఐ లు కూడా అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఆందోళన నెలకొందని, బాబు అవినీతిపై అక్కడ కూడా చర్చించుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని అన్నారు. టీడీపీకి ఒక న్యాయం, మిగిలిన పార్టీలకు మరో న్యాయం అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా సహా అన్నింటినీ చంద్రబాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.