: జనతా గ్యారేజ్... ఇక్కడ అన్ని రికార్డులు సెట్ చేయబడును: హీరో రామ్ ఆకాంక్ష
ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రముఖ హీరో రామ్ కూడా జూ.ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, తన శుభాకాంక్షలను పూర్తి వెరైటీగా చెబుతూ ఒక ట్వీట్ చేశాడు. ‘జనతా గ్యారేజ్’ చిత్ర టైటిల్ కు ఉప శీర్షికగా ‘ఇచట అన్నీ రిపేర్లు చేయబడును’ అని ఉంటుంది. అయితే, ఈ ఉపశీర్షికలో కొద్దిగా మార్పు చేస్తూ రామ్ ఏం ట్వీట్ చేశాడంటే... ‘జనతా గ్యారేజ్’ రిలీజు అయిన తర్వాత దాని ఉపశీర్షిక ‘ఇచట అన్ని రికార్డులు సెట్ చేయబడును’ అని మారాలని కోరుకుంటున్నానని ఆ ట్వీట్ లో రామ్ పేర్కొన్నాడు.