: శ్రీనగర్‌లో మరోసారి ఎగిరిన పాక్ జెండాలు.. దర్యాప్తు ప్రారంభం
శ్రీనగర్‌లో మరోసారి పాక్ జెండాలు ఎగరడం కలకలం సృష్టిస్తోంది. మిర్‌వైజ్ ఉమర్ ఫరూఖ్ వర్ధంతి సందర్భంగా పలువురు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ ర్యాలీ నిర్వహిస్తోన్న సమయంలో కొందరు పాక్, ఇస్లామిక్ జెండాలు చేతిలో పట్టుకొని, పలు చోట్ల వాటిని ఎగరేస్తూ కనిపించినట్లు సమాచారం. అక్కడి నౌహట్టాలోని ఓ మసీదు నుంచి గుంపులుగా ర్యాలీ జరుగుతుండగా కొందరు పలు నినాదాలతో పాక్ జెండాలను ఎగరేసినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.