: ఐఫోన్ 7 కౌంట్ డౌన్ ప్రారంభం?
ఐ ఫోన్ కొత్త మోడళ్లు మార్కెట్ లోకి ఎప్పుడు విడుదలవుతాయా? అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. ఐఫోన్7 ను వచ్చే సెప్టెంబరులో విడుదల చేసేందుకు సదరు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 7, 7 ప్లస్, 7 ప్లస్ ప్రో అనే మూడు వేరియంట్లను సంస్థ విడుదల చేయనుందని తెలుస్తోంది. ఐఫోన్ గత మోడళ్లతో పోలిస్తే త్వరలో విడుదల కానున్న మోడల్ మరింత స్లిమ్ గా ఉంటుందని, డిజైన్ పరంగా చిన్న మార్పులు మినహా పెద్ద తేడాలు ఉండకపోవచ్చని సమాచారం. అయితే, ఐఫోన్ 7 విడుదలకు అధికారికంగా కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలుస్తోంది.