: హైదరాబాదులో భారీ వర్షం... మెరుపులు, ఉరుములు, పిడుగులతో బీభత్సం


హైదరాబాదు వాసులను నేటి సాయంత్రం మళ్లీ వర్షం పలకరించింది. అయితే, భారీ వర్షంతో పాటు మెరుపులు, ఉరుములు, పిడుగులతో వర్షం పడడంతో నగర వాసులు భీతిల్లారు. నగరంలో పలు చోట్ల పిడుగులు పడ్డట్టు వార్తలొస్తున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షానికి రోడ్లు నీటితో నిండిపోగా, వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై పడిపోయాయి. శివారు ప్రాంతాలు కూడా వర్షంతో తడిసి ముద్దయ్యాయి. క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఈ భారీ వర్షం పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News