: పక్షిని 'ఢీ'కొట్టి ఇళ్ల మధ్య కూలిన విమానం... ప్రయాణికుల మృతి


గాలిలో పక్షిని ఢీ కొట్టిన ఫ్రాన్స్కు చెందిన తేలికపాటి విమానం ఓ గ్రామంలోని రెండు ఇళ్ల మధ్య కూలి గ్రామీణులను బెంబేలెత్తించింది. వివరాల్లోకి వెళ్తే... పోర్చుగల్ లోని కోయింబ్రా నుంచి ఫ్రాన్స్ లోని డాక్స్ కు వెళ్తున్న విమానాన్ని గగనతలంలో రాబందు 'ఢీ'కొట్టింది. దీంతో ఆ విమానం అదుపు తప్పి ఆర్బిజు అనే గ్రామంలో రెండు ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడింది. విమానం కుప్పకూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తగ్గిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్నవారు అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ప్రమాదాన్ని చూసిన గ్రామీణులు భయంతో వణికిపోయారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ సహా ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News