: చంద్రబాబు సమక్షంలో రేపు ఏపీ ఎంసెట్ ‘మెడికల్’ ఫలితాలు: గంటా
నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)పై కేంద్ర మంత్రి వర్గం ఆర్డినెన్స్ జారీ చేసి పరీక్షను వచ్చే ఏడాది నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించడంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించే విషయమన్నారు. ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు గంటా పేర్కొన్నారు. నీట్ వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిందని, చివరికి సానుకూలమైన నిర్ణయమే వచ్చిందని ఆయన తెలిపారు.