: మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి వేధింపులు... పోలీసుల అదుపులో నిందితుడు


హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని వేధింపుల పాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వారం రోజుల క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంది. ఒక హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న సిద్ధూ అనే వ్యక్తికి ఈ ఫోన్ దొరికింది. దొరికిన ఫోన్ ఇచ్చివేయాలంటే తనకు నగదు ఇవ్వాలంటూ సదరు ఉద్యోగినిని సిద్ధూ డిమాండ్ చేశాడు. అంతేకాకుండా, అసభ్యకరమైన ఎస్ఎంఎస్ లు పంపి ఆమెను వేధింపుల పాలు చేశాడు. దీంతో, విసిగిపోయిన బాధితురాలు మాదాపూర్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News