: తొలిసారిగా బోధ‌నాసుప‌త్రిలో గుండె మార్పిడి చికిత్స‌.. గుంటూరులో కొన‌సాగుతున్న అరుదైన ఆప‌రేష‌న్‌


మొట్టమొదటి సారిగా ఏపీలోని బోధనాసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. గుంటూరులోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ఈ గుండె మార్పిడి శ‌స్త్ర‌ చికిత్స‌కు వేదికయింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఏడు కొండలు అనే వ్య‌క్తి గుండెను గుంటూరు స్వర్ణభారత్‌ నగర్‌కు చెందిన యువకుడికి అమ‌రుస్తున్నారు. చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి నుంచి ఈ గుండెను జీజీహెచ్‌కు త‌ర‌లించ‌డానికి పోలీసులు కూడా స‌హ‌క‌రించారు. గ్రీన్ చానెల్ ద్వారా కేవ‌లం 14 నిమిషాల్లోనే గుండెను చినకాకాని నుంచి జీజీహెచ్‌కి తీసుకొచ్చారు. వైద్యుడు గోఖలే ఆధ్వ‌ర్యంలో ఈ గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్స కొన‌సాగుతోంది. మరో గంటలో ఆపరేష‌న్ ముగియ‌నున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News