: కర్నూలు అధికారుల అభ్యంతరాలు పట్టించుకోవద్దు, ప‌నులు కానివ్వండి: క‌ర్నాట‌క మంత్రికి హ‌రీశ్ ఫోన్‌


తెలంగాణ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి చేప‌ట్టిన రాజోలిబండ డైవర్షన్‌ స్కీం(ఆర్డీఎస్‌) ప‌నుల‌ను ఆపొద్ద‌ని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావు క‌ర్నాట‌క‌ మంత్రి పాటిల్‌కి విజ్ఞ‌ప్తి చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ విజయ్‌మోహన్ రాసిన లేఖ కార‌ణంగా ఆనకట్ట ఆధునికీకరణ, పూడికతీత పనులను ఆపొద్ద‌ని హ‌రీశ్‌రావు విన్న‌వించారు. బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ ప్ర‌కారం రాష్ట్రానికి సాగునీరు అందించే ప‌నుల‌పై ముందుకు వెళ్లాల‌ని హ‌రీశ్ కోరారు. ఆర్డీఎస్‌ పనులు మొదలు పెడితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కర్నూలు కలెక్టర్ క‌ర్నాట‌కకు ఇటీవ‌లే లేఖ రాసిన విష‌యం తెలిసిందే. వారం రోజుల‌ క్రితం ఆనకట్ట ఆధునికీకరణ పనులకు కర్నాట‌క‌ సన్నాహాలు చేపట్టగా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో పోలీసులు ఆ ప‌నుల‌ను అడ్డుకున్నారు. త‌మ ప్రాంతం దిగువకు ఉండ‌డంతో ఈ ప‌నుల‌వ‌ల్ల నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని ఏపీ ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News