: ఎవరెస్టు అధిరోహించిన దక్షిణ భారతదేశపు తొలి పోలీసు అధికారిణి రాధిక
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన దక్షిణ భారతదేశపు తొలి పోలీసు అధికారిణిగా ఆదిలాబాద్ అదనపు ఏఎస్పీ రాధిక రికార్డుల్లోకి ఎక్కారు. కడప జిల్లాకు చెందిన ఆమె ఏడాదికాలంగా అదనపు ఏఎస్పీగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఎవరెస్టు శిఖరం అధిరోహించేందుకుగాను గత నెల 5వ తేదీన తెలంగాణ రాష్ట్రం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా ఆమె అధిరోహించారు. ఆరుగురు సభ్యుల బృందంలో ఆమె ఒక్కరే మహిళ. కాగా, రాధిక గతంలో 7,077 మీటర్ల ఎత్తున్న కూన్ పర్వతాన్ని కూడా ఆమె అధిరోహించారు. ఈ పర్వతాన్ని అధిరోహించిన రెండో మహిళగా ప్రపంచం రికార్డు నాడు నెలకొల్పారు.