: అచ్యుతానందన్ కు నిరాశ.. కేర‌ళ త‌దుప‌రి సీఎంగా పిన‌రాయి విజ‌య‌న్


కేరళ తదుపరి సీఎంగా పిన‌రాయి విజ‌య‌న్ పేరును ప్రకటించాలని సీపీఎం అధిష్ఠానం నిర్ణయించింది. నిన్న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కేరళలో ఎర్రజెండా రెపరెపలాడిన సంగతి తెలిసిందే. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ ఘన విజయం సాధించి, మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు గాను ఎల్‌డిఎఫ్‌ 92 సీట్లలో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. సీఎం ఎన్నికపై తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎం) స్టేట్ కమిటీ.. ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ పినరాయి విజయన్ ను సీఎంగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈవిషయంపై ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న 93 ఏళ్ల అచ్యుతానందన్ కు నిరాశే ఎదురైంది.

  • Loading...

More Telugu News