: ఆర్డినెన్స్ పై పూర్తి వివ‌రాలు రాలేదు, వ‌చ్చాకే మా నిర్ణ‌యం: 'నీట్'పై తెలంగాణ మ‌ంత్రి ల‌క్ష్మారెడ్డి


'నీట్‌'పై కేంద్ర మంత్రి వ‌ర్గం ఆర్డినెన్స్(అత్య‌వ‌స‌ర ఆదేశం) జారీ చేయ‌డం ప‌ట్ల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. తెలంగాణ‌లో ఎంసెట్ ‘మెడిక‌ల్’పై త్వ‌ర‌లోనే తేదీలు ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. ‘కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.. కానీ, వాటి వివ‌రాలింకా పూర్తిగా బ‌య‌ట‌కి రాలేదు’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ ను ప‌రిశీలించి, త‌దుప‌రి నిర్ణ‌యం తెలుపుతామ‌ని చెప్పారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. కేంద్రం నీట్‌పై జారీ చేసిన‌ ఆర్డినెన్స్ ను ప‌రిశీలిస్తామ‌ని, తెలంగాణలో మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌ కోసం మళ్లీ ఎంసెట్‌ను నిర్వ‌హించే విషయంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తామ‌న్నారు. మ‌రోవైపు నీట్ వాయిదా వేయ‌డాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర నిర్ణ‌యం ప్రైవేటు విద్యాసంస్థ‌ల‌కు లాభాలు తెచ్చిపెట్టేందుకే అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

  • Loading...

More Telugu News