: ఇక్కడ భారీ వర్షాలు... అక్కడ ఎండల మంటలు.. దేశ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు


రోను తుపాను కారణంగా ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే ఉత్తరాదిన ప్రజలు ఎండల మంటలకు విలవిలలాడిపోతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ జిల్లా పలోడిలో గురువారం గరిష్ఠంగా 51 డిగ్రీలు నమోదైంది. దేశ చరిత్రలో ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా దీన్ని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రోను తుపాను కారణంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టు ఐఎండీ ప్రకటించింది. కానీ, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉందని పేర్కొంది. రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపింది. బికనీర్ లో 49.5, బార్మర్ లో 49.9 డిగ్రీల సెల్సియస్ ఇప్పటి వరకు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News