: నీట్ ఏడాది పాటు వాయిదా.. ఆర్డినెన్స్ జారీ
నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పై కేంద్ర మంత్రి వర్గం ఆర్డినెన్స్ (అత్యవసర ఆదేశం) జారీ చేసింది. రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో కేంద్రం ప్రభుత్వం తలొగ్గింది. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సుప్రీం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నీట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రాల అభ్యంతరాలపై ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో చర్చించిన కేంద్ర మంత్రి వర్గం చివరకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నీట్‌ను వచ్చే ఏడాదికి వాయిదావేయాలని, అలాగే ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని పలు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.