: కాంగ్రెస్ కు పెద్ద శస్త్ర చికిత్స అవసరం: డిగ్గీ రాజా
తాజా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చిన నేపథ్యంలో ఆ పార్టీ సినియర్ నేత దిగ్విజయ్ సింగ్ కటువైన వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు. ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయని, కానీ ఇవి ఊహించినవేనని అన్నారు. పార్టీకి పెద్ద శస్త్రచికిత్స అవసరమన్నారు. ఫలితాలపై పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కీలక నేత అయిన దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంది. ఓటమికి గల కారణాలను గుర్తించి ప్రజల కోసం మరింతగా పనిచేస్తామని గురువారం ఫలితాల అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏఐసీసీని పునర్వ్యవస్థీకరించాలని, రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిగా తీసుకురావాలంటూ దిగ్విజయ్ అవకాశం చిక్కినప్పుడల్లా డిమాండ్ చేస్తున్నారు. తాజా ఫలితాలతో మరోసారి ఆయన తన స్వరాన్ని గట్టిగా వినిపించారు.