: నెల్లూరులో దారుణం.. ఐదేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి.. వందకాట్లు పడిన వైనం


నెల్లూరు జిల్లాలో ఓ ఐదేళ్ల బాలిక‌పై వీధి కుక్క‌లు దాడి చేసిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నిన్న ఐదేళ్ల బాలిక‌పై జిల్లాలోని సూళ్లూరుపేట‌లో మూడు కుక్కలు దాడి చేశాయి. బాలికను తీవ్రంగా గాయ‌ప‌ర్చాయి. మూడు కుక్క‌లు ఒక్క‌సారిగా బాలిక‌పై ఎగ‌బ‌డడంతో తీవ్ర గాయాల‌పాల‌యిన బాలిక‌ను నెల్లూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ చిన్నారి శ‌రీరంపై వంద కాట్లు క‌నిపించాయి. అయితే, బాలికకు ప్రాణాపాయ ప‌రిస్థితి లేనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News