: విజయవాడలో విషాదం.. రైలు కిందపడి అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
రైలు కిందపడి అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇటీవలే తమ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈరోజు ఉదయం రాయనపాడు రైల్వేస్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురూ ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఇద్దరు యువతులు మృతి చెందగా, ఒక యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు హైదరాబాద్ నగరానికి చెందిన వారు. విజయవాడలోని పోరంకి వద్ద ప్రైవేటు ఆస్పత్రిలో వీరి తల్లి చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో వీరి కుటుంబం గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటోంది. వీరి తల్లిదండ్రుల పేర్లు సుల్తానా, రఫీ అని పోలీసులు తెలిపారు.