: నీట్ తదుపరి ఏడాది నుంచేనా..? కేంద్ర మంత్రి వర్గం భేటీ..ఆర్డినెన్స్ జారీచేసే అవకాశం
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సుప్రీం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పై కొద్దిసేపట్లో ప్రత్యేక ఆదేశాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించి, అత్యవసర ఆదేశాన్ని జారీ చేసే యోచనతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో కేంద్ర మంత్రి వర్గం భేటీ అయింది. నీట్ వచ్చే ఏడాదికి వాయిదా వేసేందుకు అత్యవసర ఆదేశాన్ని(ఆర్డినెన్స్)జారీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నీట్ పై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నీట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని, అలాగే ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.