: హైదరాబాదు శివారులో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన నలుగురు బాలికలు


హైదరాబాదు నగర శివారులో నలుగురు బాలికలు అదృశ్యం కావడం తీవ్ర సంచలనం రేపింది. నగరం శివారు ప్రాంతమైన చందానగర్ కు చెందిన నలుగురు బాలికలు ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనతో చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నారు. స్వప్న (12), పద్మ (10), రేణుక (9), కావేరి (8) చివరిగా చందానగర్ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఐదు రోజుల క్రితం కనిపించగా, ఆ తర్వాత వారి జాడ లేదు. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా వీరిని అపహరించుకుపోయారా? లేక వారంతట వారే ఎటైనా వెళ్లిపోయారా? అనే కాకుండా ఇంకా వేరే కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. స్వప్న గతంలోనూ ఒకసారి కనిపించకుండాపోయి మళ్లీ తిగిరి వచ్చింది. దీంతో స్వప్న మిగిలిన బాలికల్ని తీసుకుని వెళ్లిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వీటిపైనా దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News