: కేరళలో కాలిడిన ‘కమలం’!.... గెలిచిన ఒకే ఒక్కడుగా రాజగోపాల్!


కేరళ అసెంబ్లీలో ఎలాగైనా అడుగుపెట్టాల్సిందేనన్న కమలనాథుల కల ఎట్టకేలకు తీరింది. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భాగంగా నిన్న వెలువడిన ఫలితాల్లో బీజేపీ టికెట్ పై అసెంబ్లీ బరిలోకి దిగిన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఓ.రాజగోపాల్ విజయదుందుభి మోగించారు. తిరువనంతపురం జిల్లా నెమమ్ నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఎన్నికలో ఆయన సీపీఎం సీనియర్ నేత శివన్ కుట్టిపై 8,671 ఓట్లతో విజయం సాధించారు. తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఓటమిపాలైనా, అదే జిల్లా నుంచి రాజగోపాల్ మాత్రం విజయం సాధించారు. దీంతో కేరళలో బీజేపీ తరఫున ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన తొలి, ఒకే ఒక్కడుగా రాజగోపాల్ రికార్డులకెక్కారు.

  • Loading...

More Telugu News