: మహానాడులో వెజిటేరియన్ ఘుమఘుమలు!... నోరూరిస్తున్న మెనూ!


ఈ నెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు జరగనుంది. ఏటా వేడుకలా నిర్వహిస్తున్న మహానాడును ఆ పార్టీ... ఈ ఏడాది తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన వేలాది మంది ప్రతినిధులు పాలుపంచుకునే ఈ వేడుకకు అప్పుడే మెనూ సిద్ధమైపోయింది. ఈ నెల 26న మధ్యాహ్నం సదరు మెనూను మరోమారు పరిశీలించి మహానాడుకు వచ్చే పార్టీ ప్రతినిధులకు రుచికరమైన ఆహారాన్ని అందజేయనున్నట్లు భోజన కమిటీ కన్వీనర్ మాగంటి బాబు చెప్పారు. ఇక మెనూ విషయానికి వస్తే... 25 రకాల శాకాహార వంటకాలతో కూడిన మెనూలో రాయలసీమ, కోస్తాంధ్రలతో పాటు తెలంగాణ వంటకాలు కూడా ఉన్నాయి. వంటకాల విషయానికొస్తే... రాయలసీమ సంగటి ముద్దలు, జొన్న రొట్టెలు, ఐదు రకాల చెట్నీలు, సగ్గుబియ్యంతో కూడిన బెల్లం పాయసం, అలసంద వడలు, కట్ బజ్జీలు, పనసకాయ బిరియానీ, పాలతాళికలు ఉన్నాయి. వీటిలో పాలతాళికలు పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు అత్యంత ఇష్టమైన వంటకం!

  • Loading...

More Telugu News