: అదేమీ పొంగిపోవాల్సినంత గొప్ప విజయం కాదు: బీజేపీకి చురకలంటించిన నితీష్ కుమార్
అసోం ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల బీజేపీ అంత పొంగిపోవాల్సిన అవసరం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హితవు పలికారు. బీజేపీ చెబుతున్న గొప్ప విజయం ఆ పార్టీని వరించలేదని ఆయన అన్నారు. అసోంలో బీజేపీ ఇతర స్థానిక పక్షాలను కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన చురకలంటించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా కలిసి వచ్చిన వారితో ఎన్నికల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేదు అనుభవం చవిచూసిందని ఆయన తెలిపారు. ఈ విజయానికి బీజేపీ మరీ అంత పొంగిపోవాల్సి అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్ఛేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.