: టీడీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు
ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాకు నిన్నటివరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా వ్యవహరించిన సుబ్చారాయుడు, టీడీపీలో చేరడంతో పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో విద్యుత్ శాఖా మంత్రిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మంత్రుల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా ఒకరు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లడం, ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరడం జరిగింది.