: ఈసారి పొరపాటు జరగలేదు... ఆఫ్ఘన్ అధ్యక్షుడికి సరైన రోజున విషెస్ చెప్పిన మోదీ!


గత ఏడాది చేసిన పొరపాటును ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జరగనివ్వలేదు. గత ఏడాది ఫిబ్రవరి 12న ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మోదీ ట్వీట్ కు స్పందించిన ఘనీ, తన పుట్టిన రోజు మే 19న అని, అయినప్పటికీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మోదీకి ట్వీట్ సమాధానమిచ్చారు. ఈసారి ఆయన ఆ పొరపాటు జరగనివ్వలేదు. 'హ్యాపీ బర్త్ డే ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ...ఈసారి సరైన సమయంలో మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన ఘనీ 'మీకు ధన్యవాదాలు ప్రధాని మోదీ. నాకు మీలాంటి ప్రియమైన మిత్రుడు ఉండటం ఆనందం... నాకు, నా దేశ ప్రజలకు నిత్యం మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు' అని సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News