: తిరుమల క్యూ లైన్ లో పాము... పరుగులు తీసిన భక్తులు!
తిరుమల శ్రీవారి సర్వదర్శం క్యూలైన్ వద్ద ఈరోజు సాయంత్రం ఓ పాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వేరే క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లాలని భక్తులకు చెప్పడంతో వారు అక్కడికి పరుగులు తీశారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఒక పక్క వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.