: గుజరాత్ లయన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వీక్షించిన టిమ్ కుక్


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా కాన్పూర్ వేదికగా గుజరాత్ లయన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న 51 మ్యాచ్ ను యాపిల్ సీఈవో టిమ్ కుక్ వీక్షించారు. రాజీవ్ శుక్లాతో పాటు వీఐపీ గ్యాలరీలో ఆయన మ్యాచ్ ను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా రైనా ఫీల్డింగ్ విన్యాసాలను పరిశీలనగా చూశారు. కులకర్ణి కొట్టిన షాట్ ను మిడ్ ఆన్ లో ఆపిన రైనా మెరుపు వేగంతో గంభీర్ ను అవుట్ చేసిన విధానికి కుక్ ముగ్ధుడయ్యారు. రాజీవ్ శుక్లా ఆయనకు ఆటలో విశేషాలు వివరిస్తుండగా ఆయన మ్యాచ్ ను వీక్షించారు. టాస్ ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. అద్భుతమైన త్రోతో గౌతమ్ గంభీర్ (8) ను అవుట్ చేసిన రైనా, మనీష్ పాండే (1)ను మరో చక్కని క్యాచ్ తో అవుట్ చేయడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఊతప్ప (25), పియూష్ చావ్లా (7) ఉన్నారు.

  • Loading...

More Telugu News