: గేల్, సామి, బ్రావో, రస్సెల్ కు మొండి చేయి...పొలార్డ్ కు చోటు


వెస్టిండీస్ కు టీ20 వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ డారెన్ సమీ, క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, డ్వెన్ బ్రావోకు వెస్టిండీస్ బోర్డు మొండి చెయ్యిచూపింది. బోర్డుతో వివాదాలు, సెలెక్టర్లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నలుగురిని స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో జరగనున్న ముక్కోణపు టోర్నీకి ఎంపిక చేయలేదు. అదే సమయంలో మార్లోన్ శామ్యూల్స్, కార్లోస్ బ్రాత్ వైట్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్ లను ఎంపిక చేశారు. విండీస్ జట్టు ఎంపిక విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. జాసన్ హోల్డర్ (కెప్టెన్), సులేమన్ బెన్, కార్లోస్ బ్రాత్ వైట్, డారెన్ బ్రేవో, జోనాథన్ కార్టర్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, షానాన్ గాబ్రియేల్, సునీల్ నరైన్, ఆస్లే నర్స్, కీరన్ పొలార్డ్, రామ్ దిన్, మార్లోన్ శామ్యూల్స్, జేరోమ్ టేలర్ తదితరులను ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News