: 27న సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం... కేజ్రీవాల్ కు ఆహ్వానం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఈ నెల 27న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మమత ఆహ్వానం పంపారు. ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 294 స్థానాలకు గాను 211 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 44, లెఫ్ట్ 33, బీజేపీ కూటమి 6 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి.